: పెన్మత్స వర్సెస్ జ్యోతుల... ఏపీ అసెంబ్లీలో ‘తోక’ వ్యాఖ్యలు


ఏపీ అసెంబ్లీ ఆసక్తికర సంభాషణలతో పాటు గతంలో ఎప్పుడూ వినని కొత్త పదాలకు కూడా వేదికవుతోంది. నిన్నటి సమావేశాల్లో భాగంగా వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, బీజేపీ శాసనసభా పక్షనేత పెన్మత్స విష్ణుకుమార్ రాజుల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. పట్టిసీమ ప్రాజెక్టుపై విష్ణుకుమార్ రాజు మాట్లాడుతున్న సమయంలో ‘మీది ఒక తోక పార్టీ’ అంటూ జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. దీనిపై విష్ణుకుమార్ రాజు వెనువెంటనే ఘాటుగా స్పందించారు. ‘‘మాది తోక పార్టీ అయితే, మీ తోకలు కత్తిరించడానికి 2 నిమిషాలు చాలు’’ అని హెచ్చరించారు. జాతీయ పార్టీ అయిన తమ పార్టీపై జ్యోతుల చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News