: చీప్ లిక్కర్ పై టీ సర్కారు వెనకడుగు... స్వయంగా వెల్లడించిన కేసీఆర్


రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలతో తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ పై వెనకడుగు వేయక తప్పలేదు. నిన్నటి కేబినెట్ భేటీలో కేసీఆర్ సర్కారు చీప్ లిక్కర్ అమలును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నిన్నటి కేబినెట్ వివరాలను మీడియాకు వివరించిన క్రమంలో సీఎం కేసీఆరే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ‘‘గుడుంబాను అరికట్టడంపై కేబినెట్ సమావేశంలో తీవ్రంగా చర్చించాం. దీనిని అరికట్టడంపై సమాజం నుంచి, వరంగల్ జిల్లాలో నేను పర్యటించినప్పుడు ఒక మహిళ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు... ప్రత్యామ్నాయ పానీయం (డ్రింక్) అందించాలనే ఒక సూచన వచ్చింది. ప్రత్యామ్నాయం లేకుంటే గుడుంబాను అరికట్టలేం. దాని తయారీదారులు, సరఫరాదారులు, వ్యాపారులు బాగా విస్తరించారు. అందువల్ల గుడుంబా ధరకే చీప్ లిక్కర్ ను అందుబాటులోకి తెచ్చి, గుడుంబాను నియంత్రించాలని భావించాం. దీనిపై తుదినిర్ణయం తీసుకోనప్పటికీ, చర్చ మాత్రం జరిగింది. అయితే, దీనిపై సమాజం నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అందువల్ల ఈ ఏడాది పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించాం’’ అని కేసీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News