: బాబు సమక్షంలో సైకిలెక్కిన ఆమంచి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ సైకిలెక్కారు. ఆమంచికి టీడీపీ కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఆమంచి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న వ్యక్తి అని కొనియాడారు. రాజకీయ పార్టీలను కాదని ఆమంచిని చీరాల ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డున పడేయడానికి ముఖ్యమంత్రి చాలా కష్టపడుతున్నారని అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని పైకి తేవడానికి ఆయన పడుతున్న తపన చూసి తాను టీడీపీలో చేరుతున్నానని పేర్కొన్నారు. ఇకపై టీడీపీతో కలిసి నడుస్తానని ఆయన స్పష్టం చేశారు. కాగా, చీరాల నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.