: నల్గొండ మున్సిపాలిటీలో 3.32 కోట్లు స్వాహా...21 మంది సస్పెన్షన్


ప్రభుత్వోద్యోగుల నరనరాల్లో అవినీతి ఎలా జీర్ణించుకుపోయిందో వెల్లడించే ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. అవినీతికి పాల్పడుతూ పై స్థాయి అధికారులు పట్టుబడుతుండగా, కింది స్థాయి ఉద్యోగులు గుట్టు చప్పుడు కాకుండా ప్రజాధనం నొక్కేస్తున్నారు. నల్గొండ జిల్లా పురపాలక శాఖలో జరిగిన కుంభకోణం సుదీర్ఘ ఆడిటింగ్ అనంతరం వెలుగుచూసింది. ఆడిట్ అధికారుల తనిఖీల్లో 3.32 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు గుర్తించారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన అధికారులు వాటి వివరాలు రికార్డుల్లో చూపించలేదు. దీంతో 2011-2015 మధ్య పన్ను వసూళ్లలో 3.32 కోట్ల రూపాయల ఆదాయానికి గండికొట్టారు. దీనిని గుర్తించిన ఆడిటింగ్ అధికారులు ఆరుగురు రెవెన్యూ అధికారులు, 15 మంది బిల్ కలెక్టర్లపై సస్పెన్షన్ వేటు వేశారు.

  • Loading...

More Telugu News