: ఈబేతో 'బెస్ట్ డీల్' కుదిరింది!


ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ ఈబే ఇండియాతో 'బెస్ట్ డీల్' టీవీ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఈబే ఇండియా వైస్ ప్రెసెడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ లతిఫ్ నతాని, బెస్ట్ డీల్ టీవీ సీఈవో రాజ్ కుంద్రా, బెస్ట్ డీల్ టీవీ ఛైర్ పర్సన్, ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా పాల్గొన్నారు. రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్టు వీరు ప్రకటించారు. కాగా, ఈ ఒప్పందం ప్రకారం ప్రముఖ వాణిజ్య ప్రచార టీవీ బెస్ట్ డీల్, ఈబేకు సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన ప్రచార వ్యవహారాలను ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ లలో ప్రసారం చేయనుంది. ఈ ఒప్పందం ద్వారా సుమారు 20,000 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశం ఉందని ఈబే ఇండియా వైస్ ప్రెసెడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ లతిఫ్ నతాని తెలిపారు. భారతీయ ఉత్పత్తులకు తమ టీవీ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభించేలా చేయడం తమ పని అని బెస్ట్ డీల్ టీవీ సీఈవో రాజ్ కుంద్రా తెలిపారు.

  • Loading...

More Telugu News