: పాక్ లో నకిలీ టైగర్ మెమన్ ను అరెస్టు చేశారు!


ముంబై పేలుళ్ల దోషి టైగర్ మెమన్ ను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారా? పాకిస్థాన్ మీడియాలో టైగర్ మెమెన్ ను అరెస్టు చేశారంటూ వార్తలు వెలువడ్డాయి. దీంతో భారతీయ మీడియా ప్రతినిధులు పాకిస్థాన్ కు ఫోన్ చేశారు. దీంతో పాకిస్థాన్ అధికారులు అరెస్టైంది టైగర్ మెమన్ కాదని, టైగర్ మెమన్ పేరు చెప్పుకుని వసూళ్లకు పాల్పడుతూ, మహిళలను వేధిస్తున్న వ్యక్తి అని చెప్పారు. కరాచీలో ఫర్గన్ అనే వ్యక్తి టైగర్ మెమన్ పేరు చెప్పుకుని నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ తో మహిళలను వేధిస్తున్నాడు. అతనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత టైగర్ మెమన్ అరెస్టయ్యాడంటూ వార్తలు రావడంతో భారతీయ మీడియా అతని అరెస్టుపై ఆసక్తి ప్రదర్శించింది. కాగా, 1993 ముంబై పేలుళ్లకు పాల్పడ్డ టైగర్ మెమన్ 257 మంది మరణానికి కారణమయ్యాడు. ముంబై పేలుళ్ల అనంతరం దుబాయ్ పారిపోయిన టైగర్ మెమన్, అక్కడ భారత ఇంటెలిజెన్స్ విభాగం పట్టుకునే ప్రమాదం ఉందని భావించి పాకిస్థాన్ లోని కరాచీలో ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News