: ప్రజలను తాగుబోతులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది: ఎర్రబెల్లి


తెలంగాణలో చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలనుకుంటున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆదాయం కోసమే ప్రజలను తాగుబోతులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కేసీఆర్ గీత కార్మికుల పొట్టకొడుతున్నారన్నారు. చీప్ లిక్కర్ పాలసీని విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మీడియా సమావేశంలో హెచ్చరించారు. మద్యం పాలసీ పేరుతో రాష్ట్రం మొత్తాన్ని లిక్కర్ మాఫియా చేతిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇక సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబ్బులకోసం చీప్ లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆ పార్టీ మరో నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం కుంటుపడిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News