: వేలానికి వచ్చిన చైనా చక్రవర్తుల వస్తువులు... భారీ ధర పలుకుతాయని అంచనా


చైనా చక్రవర్తి యాంగ్ చాంగ్ కాలానికి చెందిన ఓ బౌల్, చక్రవర్తి క్విన్ లాంగ్ కు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ వేలానికి వచ్చాయి. చక్రవర్తులకు చెందిన అపురూప వస్తువులు కావడంతో, వీటికి భారీ రేటు వస్తుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన హాంకాంగ్ లో వీటిని వేలం వేయనున్నారు. ఈ వేలానికి సంబంధించిన ప్రెస్ మీట్ సందర్భంగా వీటిని ప్రదర్శించారు. నిర్వాహకుల అంచనా ప్రకారం, బౌల్ కు 5.1 నుంచి 7.7 మిలియన్ డాలర్లు వస్తాయని, అలాగే పెయింటింగ్ కు 7.7 మిలియన్ డాలర్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News