: డిసెంబర్ లో మాతో క్రికెట్ ఆడుతారా? లేదా?: బీసీసీఐకి పీసీబీ లేఖ


డిసెంబర్ లో మాతో క్రికెట్ ఆడుతారో, లేదో తేల్చి చెప్పాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాసింది. క్రీడలు, రాజకీయాలు, ద్వైపాక్షిక సంబంధాలను వేర్వేరుగా చూడాలని పీసీబీ లేఖలో బీసీసీఐకి సూచించింది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో ఆడాల్సిన మూడు వన్డేలు, రెండు టెస్టులను నిర్వహించేందుకు సహకరించాలని పీసీబీ, బీసీసీఐని కోరింది. తటస్థ వేదికపై భారత్ తో పాక్ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించేందుకు పీసీబీ తహతహలాడుతోంది. భారత్ తో మ్యాచ్ లు నిర్వహిస్తే కష్టాల్లో ఉన్న పీసీబీకి భారీగా ఆదాయం సమకూరుతుందని పీసీబీ భావిస్తుండగా, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్న పాక్ తో ఆడేందుకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి లేఖ రాసింది.

  • Loading...

More Telugu News