: సీమ సమస్యలపై ఈ నెల 9న ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం: బైరెడ్డి


రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో సొంత పార్టీ పెట్టిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సీమ సమస్యలపై ఏదో ఒక రకంగా పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఈ నెల 9న సీమ సమస్యలపై ఢిల్లీలో ధర్నా చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. 14న పూడిచర్ల నుంచి కలెక్టరేట్ వరకు ఎద్దుల బండ్లతో ర్యాలీగా వెళతామని చెప్పారు. కర్నూలులో ఈరోజు బైరెడ్డి ఓర్వకల్లు మండల రైతులతో సమావేశమై భూపరిరక్షణ సమితి కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమల పేరుతో సాగు భూములను లాక్కోవద్దని ప్రభుత్వాన్ని కోరారు.

  • Loading...

More Telugu News