: ఎక్కువగా మాట్లాడకండి: రోజాను హెచ్చరించిన స్పీకర్
ఏపీ శాసనసభ సమావేశాల్లో ఈ రోజు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైకాపా ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా స్పీడుకు స్పీకర్ కోడెల శివప్రసాద్ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. అన్ని విషయాలపై రోజా అడ్డు తగులుతుండటంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రతి విషయంపై మీరు ఏదో ఒకటి మాట్లాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ రోజాను ప్రశ్నించారు. తమరు ఎక్కువగా మాట్లాడటం తగ్గించుకోవాలంటూ కోడెల సూచించారు. ఆ తర్వాత రోజా తన సీట్లో కూర్చున్నారు.