: చెడగొట్టాలనుకుంటే మీరే చెడిపోతారు: వైసీపీకి చంద్రబాబు హితబోధ
రాష్ట్రంలో కరవు చాలా తీవ్రంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గోదావరి నుంచి వెయ్యి టీఎంసీల నీరు సముద్రంలోకి వెళుతోందని... దీన్ని అరికట్టడానికే పట్టిసీమ ప్రాజెక్టు తెచ్చామని చెప్పారు. రానున్న రోజుల్లో ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క ఎకరాను కూడా ఎండిపోనివ్వమని తెలిపారు. గతంలో తోటపల్లికి శంకుస్థాపన చేసిన తానే ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞాన్ని పూర్తి చేసి ఉంటే కొంత వరకు బాగుండేదని చెప్పారు. రాయలసీమలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు. తాగటానికి కూడా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ఏదేమైనప్పటికీ అన్ని పనులను పూర్తి చేయడానికి బగీరథ ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పంటలన్నింటికీ పూర్తిగా నీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వాజ్ పేయి హయాంలో నదుల అనుసంధానం జరిగిందని... ఇప్పుడు తాము అదే పని చేస్తున్నామని తెలిపారు. ప్రతి విషయాన్ని వైకాపా నేతలు అడ్డుకోవడం సరికాదని అన్నారు. 'ఇప్పటికైనా మంచిగా ఆలోచించండి, చెడగొట్టే పనులు వద్దు, మీరే చెడిపోతారు' అంటూ హితబోధ చేశారు.