: ఈ నెల 21 నుంచి ఏయూలో ఐఐఎం తరగతులు
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఈ నెల 21 నుంచి ఐఐఎం తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 120 మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు నేతృత్వంలో పలువురు మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. త్వరలో మొదలుకాబోతున్న ఐఐఎం తరగతులపై చర్చించారు. మంత్రిని కలసిన వారిలో బెంగళూరు ఐఐఎం ప్రాజెక్ట్ డీన్ ఆచార్య సౌరవ్ ముఖర్జీ, ప్రోగ్రామ్ డీన్ ఆచార్య సుధారావు, కార్యాలయం డైరెక్టర్ పునీత్ కౌర్ విశాఖ ఐఐఎం అధికారి చంద్రశేఖర్ రావు తదితరులున్నారు. తరగతుల తరువాత వారం రోజుల పాటు ఓరియెంటేషన్ క్లాసులు కూడా నిర్వహించే అవకాశం ఉంది.