: అక్కడ నుంచి తీసేయగలరేమో కానీ, ప్రజల గుండెల్లో నుంచి తీసేయలేరు: రోజా
రాజశేఖరరెడ్డి ఫొటోను అసెంబ్లీ లాంజ్ నుంచి తొలగించగలరేమో కానీ... ప్రజల గుండెల్లో నుంచి ఆయనను తొలగించలేరని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. కేవలం కుట్రతోనే వైయస్ ఫొటోను తొలగించారని ఆరోపించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వెంటనే కరవు వచ్చిందని... రాజశేఖర రెడ్డి హయాంలో పుష్కలంగా వర్షాలు పడ్డాయని, కరవు పరిస్థితులు లేవని చెప్పారు. వైయస్ బతికుంటే కరవు ఉండేది కాదని ఆమె అన్నారు.