: మద్యం మత్తులో తల్లిని కాల్చి చంపిన మాజీ సైనికోద్యోగి
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న మస్తాన్ వలి(47) అనే వ్యక్తి లైసెన్స్ లేని తుపాకితో తల్లిని కాల్చి చంపాడు. ఆర్మీలో పనిచేసిన మస్తాన్ రిటైరయ్యాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి తాగుడుకు బానిసయ్యాడు. దాంతో ఎప్పడూ తల్లి ఫజ్లూం (65)తో గొడవపడుతుండేవాడు. ఇవాళ కూడా తాగిన మస్తాన్ తల్లితో ఘర్షణపడుతూ తుపాకితో కాల్చడంతో అక్కడికక్కడే ఆమె చనిపోయింది. వెంటనే అతను పరారయ్యాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అతని కోసం దర్యాప్తు ప్రారంభించారు.