: రూ. 10 వేల కన్నా తక్కువ ధరలో జియోనీ 4జీ ఫోన్


స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి దూసుకొచ్చి, భారతీయులకు దగ్గరైన చైనా సంస్థ జియోనీ తాజాగా 4జీ స్మార్ట్ ఫోన్ ను రూ. 9,999కి విడుదల చేసింది. అతి త్వరలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. జియోనీ ఎఫ్ 103 పేరిట లభ్యమయ్యే ఫోన్ లో 5 అంగుళాల డిస్ ప్లే ఉంటుందని, 1.3 జీహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8/5 ఎంపీ కెమెరాలు, 2 జిబీ రామ్, 16 జిబీ స్టోరేజ్ తో లభించే ఫోన్ ఆండ్రాయిడ్ 5.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుందని వివరించింది. వైఫై, జీపీఎస్, జీపీఆర్ఎస్, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ తదితర అన్ని సౌకర్యాలూ ఉన్నాయని జియోమీ ఇండియా జనరల్ మేనేజర్ తిమిర్ బరాన్ ఆచార్య తెలియజేశారు. కాగా, ఇప్పటికే రూ. 10 వేల దిగువన లెనోవో కే2 నోట్, మోటరోలా థర్డ్ జన్ జీ తదితర 4జీ ఫోన్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News