: విజయం వెంటే శుభవార్త!... టీ20ల్లో టాప్ ర్యాంక్ కు చేరిన కోహ్లీ


కెప్టెన్ గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్న టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ కు మరో శుభవార్త అందింది. టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. నిన్నటిదాకా రెండో ర్యాంకులో ఉన్న అతడు, అనూహ్యంగా టాప్ పొజిషన్ చేజిక్కించుకున్నాడు. అయినా ఇటీవల విరాట్ టీ20 మ్యాచ్ లేమీ అడలేదు కదా, అతడి ర్యాంకెలా మెరుగుపడిందనేగా? మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం. నిన్నటిదాకా టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ 871 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ కు ఫించ్ గైర్హాజరయ్యాడు. దీంతో ఒక్కసారిగా అతడు 17 రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 854 రేటింగ్ పాయింట్లున్నాయి. దీంతో ఈ జాబితాలో 861 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ మ్యాచ్ ఆడకుండానే ఆటోమేటిక్ గా టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు.

  • Loading...

More Telugu News