: జనసేన అధినేత బర్త్ డేకి టీడీపీ నేత ప్రత్యేక యాడ్... ఆసక్తి రేపుతున్న టీవీ ప్రకటన


తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఓ యాడ్ ఆసక్తి రేపుతోంది. జనసేన అధినేత, టాలీవుడ్ అగ్ర హీరో పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రసారమవుతున్న ఆ యాడ్ ను టీడీపీకి చెందిన కృష్ణా జిల్లా ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు జారీ చేశారు. పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూనే తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో జనసేనాధిపతి సంబంధాలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగాలని బొండా ఉమ ఆ యాడ్ లో అభిలషించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఫొటోలతో పాటు బొండా ఉమా ఫొటో ఉన్న ఆ యాడ్ ఆసక్తికర చర్చకు తెరలేపింది.

  • Loading...

More Telugu News