: 200 మీటర్ల లోయలో పడి తునాతునకలైన బస్సు
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు డ్రైవర్ ప్రమాదవశాత్తు 200 అడుగుల లోతున్న లోయలోకి పోనిచ్చేశాడు. దీంతో వాహనం తునాతునకలైంది. హిందుస్థాన్ టిబెట్ నేషనల్ హైవే పై రెకింగ్ పొయ్ నుంచి 50 మంది ప్రయాణికులతో రామ్ పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 15 మంది అక్కడికక్కడ మృత్యువాతపడగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, సంఘటన జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలో సట్లెజ్ నది ప్రవహిస్తోంది. నదిలో బస్సు పడి ఉంటే మృతుల సంఖ్య మరింత పెరిగేదని అధికారులు పేర్కొన్నారు.