: సంగక్కరతో ప్రశంసలందుకుని...'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గా నిలిచాడు!
స్వదేశంలో బాగానే వికెట్లు తీస్తాడు...విదేశాల్లో అట్టర్ ఫ్లాప్ అంటూ తనపై వస్తున్న విమర్శలకు అశ్విన్ బంతితోనే సమాధానమిచ్చాడు. విమర్శలనే పునాదులుగా చేసుకుని సత్తా చాటాడు. బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో రాణించినా, తగినంత గుర్తింపుకు నోచుకుని అశ్విన్, శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ లో 21 వికెట్లు పడగొట్టిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. కెప్టెన్ బంతి అందించిన ప్రతిసారీ వికెట్లు తీసి సత్తాచాటాడు. సిరీస్ లో ఆది నుంచీ ఆధిపత్యం ప్రదర్శించిన అశ్విన్ టీమిండియా బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఈ సిరీస్ తో అంతర్జాతీయ కెరీర్ ముగించిన శ్రీలంక దిగ్గజ బ్యాట్స్ మన్ సంగక్కరను రెండు సార్లు అశ్విన్ పెవిలియన్ బాట పట్టించాడు. కెరీర్ ముగింపు సందర్భంగా సంగక్కర మాట్లాడుతూ, జహీర్ ఖాన్ క్లిష్టమైన బౌలర్ అంటూ పేర్కొని, అశ్విన్ ను ఎదుర్కోవడం కష్టమని పేర్కొన్నాడంటే...దిగ్గజ బ్యాట్స్ మన్ సంగకు ఎలాంటి బంతులు సంధించాడో అర్థం చేసుకోవచ్చు.