: షాహిద్ తో నాకు ఎటువంటి విభేదాలు లేవు!: సైఫ్
షాహిద్ కపూర్ తో తనకు విభేదాలు ఎందుకుండాలని బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రశ్నించాడు. షాహిద్ కపూర్ తో తనకు విభేదాలంటూ వస్తున్న వార్తలపై సైఫ్ స్పందించాడు. ఎప్పుడో కరీనాతో షాహిద్ డేటింగ్ చేస్తే... అతనిని తానెందుకు శత్రువుగా భావించాలని సైఫ్ ప్రశ్నించాడు. షాహిద్ ఎప్పుడూ హుందాగా ఉంటాడని సైఫ్ పేర్కొన్నాడు. అందరూ అనుకుంటున్నట్టుగా తమ మధ్య విభేదాలు లేవని తెలిపాడు. అలాంటివి ఉంటే కనుక తామిద్దరం కలిసి ఎలా పని చేస్తామని సైఫ్ ఎదురుప్రశ్నించాడు. కాగా, షాహిద్ జడ్జ్ గా వ్యవహరిస్తున్న 'ఝలక్ దిఖలాజ సీజన్ 8'లో 'ఫాంటమ్' సినిమా ప్రమోషన్ లో సైఫ్ పాల్గొన్నాడు. 'జబ్ వి మెట్' సినిమా సందర్భంగా కరీనా కపూర్, షాహిద్ కపూర్ కొంత కాలం డేటింగ్ చేశారు. ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారనగా వారి బంధం బద్దలైంది.