: భారతీయుల కోసం మరో కార్డ్ 'కామన్ కార్డ్'


వివిధ రకాల క్రెడిట్, ఏటీఎం కార్డులతో పాటు, ఆధార్, పాన్ కార్డుల మాదిరిగానే మరో కార్డును మెట్రో నగరాల్లోని ప్రజలు వెంట ఉంచుకోక తప్పదేమో. పట్టణాలు, నగరాల్లోని ప్రజల కోసం 'స్మార్ట్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్' (ఎన్సీఎంసీ)ని విడుదల చేస్తున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఈ కార్డును వాడుతూ, నగరాల్లోని పలు రకాల రవాణా వ్యవస్థలను వినియోగించుకోవచ్చని, షాపింగ్ సైతం చేసుకునేలా దీన్ని 'ఈవీఎం ఓపెన్ లూప్ కార్డ్ విత్ స్టోర్డ్ వాల్యూ' విధానంలో రూపొందించామని తెలిపారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన వెంకయ్యనాయుడు ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు, విభిన్న రకాల రవాణా వ్యవస్థలను ఒకే కార్డుతో వాడేలా చూడాలన్న నిర్ణయంతో దీన్ని తయారు చేశారని తెలుస్తోంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ), సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (సీ-డాక్), బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ), ఆర్థిక మంత్రిత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఈ కార్డుకు రూపకల్పన చేశారు. మెట్రో, రైల్వే, సిటీబస్... ఇలా ఏది ఎక్కాలన్నా ఒకే కార్డు సరిపోతుంది. వివిధ రకాల బిల్స్ చెల్లింపులు, ఎంపిక చేసిన మాల్స్ తదితరాల్లో వాడకానికి ఈ కార్డును వాడుకోవచ్చు.

  • Loading...

More Telugu News