: తెలంగాణలో ఎనిమిదవ రోజుకు చేరిన అర్చకుల సమ్మె... మోకాళ్లపై కూర్చుని నిరసన


తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఆలయాల అర్చకులు, ఉద్యోగులు చేస్తున్న సమ్మె నేటితో ఎనిమిదవ రోజుకు చేరింది. అర్చకులు ఒక్కోరోజు ఒక్కోవిధంగా తమ నిరసన తెలుపుతున్నారు. ఇవాళ మెదక్ జిల్లా వర్గల్ లోని ఆలయ మండపంలోని గర్భగుడి ముందు మోకాళ్లపై కూర్చుని అర్చకులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం తమను కరుణించేలా చూడాలని, ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేలా కటాక్షించాలని నాచగిరీశుని మొక్కుకున్నారు. అంతకుముందు వర్గల్ లోనే నాచగిరీశునికి వినూత్న రీతిలో ముడుపుకట్టి, గోపురమెక్కి, రోడ్డుకు అడ్డంగా బైఠాయించి అర్చకులు రాస్తారోకో చేశారు.

  • Loading...

More Telugu News