: సుజనా ఇండస్ట్రీస్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు


కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా ఇండస్ట్రీస్ కు సుప్రీంకోర్టులో భంగపాటు ఎదురైంది. కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మారిషస్ బ్యాంకుకు చెల్లించాల్సిన రుణాన్ని సుజనా ఇండస్ట్రీస్ లిక్విడేట్ చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. సుజనా ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ హైస్టియా మారిషస్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.100 కోట్ల రుణాన్ని ఎగవేసింది. హైస్టియా తరపున బ్యాంకుకు సుజనా ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. దాంతో ఆ రుణాన్ని సుజనా ఇండస్ట్రీస్ నుంచి లిక్విడేట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని మారిషస్ బ్యాంకు హైకోర్టును కోరింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30లోపు బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అందుకే హైకోర్టు తీర్పును సుజనా సంస్థ సుప్రీంలో సవాల్ చేసింది.

  • Loading...

More Telugu News