: జగన్ మా వాడే... బాబు 'ఔట్ డేటెడ్' అన్న మాట నిజమే!: జేసీ


జగన్ చెప్పినట్టుగా చంద్రబాబు 'ఔట్ డేటెడ్ సీఎం'లానే కనిపిస్తున్నారని తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. చంద్రబాబుకు కోపం, ఆవేశం తక్కువని, ఆ విషయంలో చంద్రబాబుతో పోలిస్తే జగన్ ఎంతో ముందు నిలిచాడని ఆయన అన్నారు. హోదా కోసం పోరాటానికి ముందు నిలిచి, వస్తుందంటే తనతో పాటు మరో 10 మంది ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ఆయన అన్నారు. జగన్ తమవాడేనని అభిప్రాయపడ్డ జేసీ, రాజకీయాల్లో ఆయన మరింతగా రాటుదేలాల్సి వుందని వివరించారు. అంతకుముందు ఎట్టి పరిస్థితుల్లోను ఏపీకి ప్రత్యేక హోదా రాదని జేసీ దివాకర్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

  • Loading...

More Telugu News