: తొలిసారిగా మీడియా ముందుకొచ్చిన ఇంద్రాణి మొదటి భర్త, ఏమన్నాడంటే..!
తల్లి చేతుల్లో దారుణ హత్యకు గురైన షీనా బోరా అసలు తండ్రిగా భావిస్తున్న సిద్ధార్థ దాస్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. "షీనాను ఇంద్రాణి హత్య చేసి వుంటే ఆమెను ఉరితీయాలని కోరుకుంటున్నా" అని వ్యాఖ్యానించారు. ఇంతవరకూ ముంబై పోలీసులు తనను సంప్రదించలేదని, ఆ అవసరం వారికి రాదనే అనుకుంటున్నానని అన్నారు. ముఖం కనిపించకుండా మీడియా ముందుకు వచ్చిన ఆయన, ఇంద్రాణి, తను వివాహం చేసుకోలేదని, 1989లో వారి ఇంట్లోనే సహజీవనం చేశామని, ఆపై విడిపోయిన తరువాత మరెప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. మిఖాయిల్ తో తనకు అసలు అనుబంధమే లేదని వివరించారు.