: పట్టు బిగించిన భారత్... ఓటమి దిశగా శ్రీలంక


శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. చివరిరోజు 3 వికెట్ల నష్టానికి 67 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక... తొలి సెషన్ లో మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఈనాటి ఆటలో ఓపెనర్ సిల్వ (27), తిరిమన్నె (12) వికెట్లను భారత్ పడగొట్టింది. సిల్వను ఉమేష్ యాదవ్ బలిగొనగా, తిరిమన్నేను అశ్విన్ ఔట్ చేశాడు. ప్రస్తుతం కెప్టెన్ మాథ్యూస్ (56), పెరీరా (12) క్రీజులో ఉన్నారు. లంచ్ విరామ సమయానికి లంక స్కోరు 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు. విజయానికి మరో 252 పరుగులు చేయాల్సి ఉంది. మరో 68 ఓవర్ల ఆట మిగిలి ఉంది.

  • Loading...

More Telugu News