: డ్రగ్ కంట్రోల్ పరీక్షల్లో 'పాస్' కాని ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల మందులు!


డ్రగ్ కంట్రోల్ విభాగం జరిపిన పరీక్షల్లో ఢిల్లీలోని పది ప్రభుత్వ ఆసుపత్రుల మందులు ఫెయిల్ అయ్యాయి. 2010 నుంచి 2015 మధ్యకాలంలో ఇంతవరకు ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 12 రకాల మందులను పరీక్షల కోసం తీసుకుని పరీక్షించగా, ఏదీ పాస్ కాలేదని డ్రగ్స్ కంట్రోల్ శాఖ ఇచ్చిన సమాధానంలో తెలిపింది. ఇలా ఫెయిలైన మందుల్లో ప్రముఖ ఎయిమ్స్ ఆసుపత్రి మందులు కూడా ఉన్నాయి. రాజన్స్ బన్సాల్ అనే ఆర్టీఐ ఉద్యమకారుడు చేసిన దరఖాస్తు మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెల్లడైంది. డ్రగ్స్ కంట్రోల్ శాఖ డ్రగ్స్ నమూనాలు తీసుకున్న ఆసుపత్రులు చూస్తే... సంజయ్ గాంధీ ఆసుపత్రి, సెంట్రల్ మెడికల్ స్టోర్ ఎంసీడీ బిల్డింగ్ ఆసుపత్రి, సఫ్దర్ జంగ్ ఆసుపత్రి, ఎయిమ్స్ ఆసుపత్రి, శ్రీ దాదా దేవ్ మత్రి అవమ్ శిషు చికిత్సాలయ ఆసుపత్రి, జీటీబీ ఆసుపత్రి, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రి, ఆచార్య భిక్షు ఆసుపత్రి, రాప్ తులా రాం మెమోరియల్ ఆసుపత్రులున్నాయి.

  • Loading...

More Telugu News