: ప్రత్యేక హోదాపై ఆత్మహత్యలు బాధాకరం... ఎవరూ ఆవేశాలకు లోనుకావొద్దు: చంద్రబాబు


రెండో రోజు శాసనససభ సమావేశాల్లో ఏపీ ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు తన ప్రకటనను కొనసాగించారు. ప్రత్యేక హోదా రాదనే ఆవేదనతో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. హోదా సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, యువత ఆవేశాలకు లోను కావొద్దని విజ్ఞప్తి చేశారు. విభజన హేతు బద్ధతగా జరగలేదన్నారు. ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా విభజన చేయడం వల్లే సమస్య వచ్చిందని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్టికల్ 3ను వినియోగించి విభజన చేశారని చెప్పారు. దేనికీ అన్యాయం జరగకుండా రాష్ట్రాన్ని సమన్యాయంతో విభజించాలని తాను చెప్పానని, ఉమ్మడిగా ఉంటే తెలంగాణ ప్రజలను ఒప్పించాలని, విభజిస్తే ఆంధ్రాకు న్యాయం చేయాలని తెలిపానని వివరించారు. ఇక ఆస్తులు, ఆప్పుల పంపకాల విషయంలో కూడా అన్యాయం జరిగిందన్నారు.

  • Loading...

More Telugu News