: సెప్టెంబర్ 2న ఆటోలు బంద్...హైదరాబాదులో భారీ ఆటో ర్యాలీ
సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా ఆటోలు నిలిచిపోనున్నాయి. దేశ వ్యాప్త ఆటోబంద్ కు యూనియన్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాదులో కూడా సమ్మె నిర్వహించాలని ఆటో సంఘాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా హైదరాబాదులో భారీ ర్యాలీ నిర్వహించాలని ఆటో సంఘాలు భావిస్తున్నాయి. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించనున్నాయి. ఈ ర్యాలీలో ఐఎఫ్ టియూ, టీఆర్ఎస్ ఆటోకార్మిక సంఘాలు పాల్గొననున్నాయని ఆ సంఘాల ప్రతినిధులు తెలిపారు.