: శ్రీలంక ముందు పరుగుల 'కొండ'... విజయానికి టీమిండియా తహతహ!


చివరి టెస్టులో విజయానికి భారత్ తహతహలాడుతోంది. చివరి రోజు ఆట మిగిలి ఉండగా, తమ 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు టీమిండియా ఆటగాళ్లు తెరదించనున్నారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వర్షం పడి ఆటకు అంతరాయం కలగకపోతే విజయం భారత ఆటగాళ్లదేనని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడో టెస్టులో 386 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఆటగాళ్లు నేడు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేశారు. అంతకు ముందు ఓవర్ నైట్ 21/3 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా టాప్ ఆర్డర్ మరోసారి విఫలమైంది. మిడిలార్డర్ పోరాటం, టెయిలెండర్ల తెగువతో టీమిండియా 274 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా, తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 312 పరుగులు చేయగా, శ్రీలంక 201 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో విజయం సాధించాలంటే శ్రీలంక ఇంకా 319 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఏదయినా అద్భుతం జరిగితే తప్ప టీమిండియా విజయాన్ని శ్రీలంక అడ్డుకోవడం అసాధ్యమనే వ్యాఖ్యానాలు వినిపిస్తుండగా, క్రీజులో సిల్వ (24), కెప్టెన్ మాధ్యూస్ (22)కు జతగా ఆడుతున్నాడు.

  • Loading...

More Telugu News