: కుప్ప కూలుతున్న శ్రీలంక... మూడో వికెట్ పతనం
టెస్ట్ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనున్న మూడో టెస్టులో 386 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక తడబడుతోంది. కేవలం 21 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి, ఎదురీదుతోంది. జట్టు స్కోరు 1 వద్ద తరంగ, 2 వద్ద కరుణరత్నే, 21 వద్ద చండిమల్ వికెట్లను కోల్పోయింది. ఇషాంత్ శర్మ రెండు వికెట్లను పడగొట్టగా, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. సిల్వ, మాథ్యూస్ క్రీజులో ఉన్నారు. శ్రీలంక ప్రస్తుత స్కోరు 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు. ఈరోజు ఆటలో మరో 10 ఓవర్లు మాత్రం మిగిలి ఉన్నాయి.