: వరంగల్ ఎంపీ రేసులో నేను లేను: దామోదర రాజనర్సింహ
కాంగ్రెస్ కు టీమ్ వర్క్ అవసరమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ అన్నారు. ఇటీవల టీఆర్ఎస్ లోకి వెళ్లిన డీఎస్ కోవర్టిజానికి ఆద్యుడని విమర్శించారు. జగ్గారెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. దొరలను ఎదుర్కొనేది ఎప్పటికైనా దళితులేనన్న దామోదర, ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతున్నామని ఒప్పుకున్నారు.