: చంద్రబాబు చెప్పడం వల్లే బీజేపీలోకి వెళ్లా... నా నోటి దురుసుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి: జగ్గారెడ్డి


తన నోటి దురుసుతోనే గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని, అధికార పార్టీకి ఉద్యోగులు దూరం కావడం కూడా తన ఓటమికి కారణమైందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం పలువురు కాంగ్రెస్ నేతల సమక్షంలో ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కండువా కప్పి జగ్గారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. తాను బీజేపీలోకి ఎందుకు వెళ్లానో తెలియడం లేదని, ఆ సమయంలో ఏవో ఆలోచనలతోనే ఆ పార్టీలో చేరానని తెలిపారు. తనకు చంద్రబాబు ఫోన్ చేసి, బీజేపీలో చేరితే భవిష్యత్ ఉందని చెప్పడంతోనే తొందర పడ్డానని జగ్గారెడ్డి వివరించారు. తాను తదుపరి ఎన్నికల్లో సంగారెడ్డిలో గెలిచితీరుతానన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత తెలంగాణలో 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతుల మరణాలకు కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, సునీతా లక్ష్మారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News