: ఖమ్మం జిల్లాలో డెంగ్యూ కలకలం... వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లాలో డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతోంది. జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో డెంగ్యూ జ్వరంతో నరసింహారావు (40) అనే వ్యక్తి మృతి చెందాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నరసింహారావును ఐదు రోజుల క్రితం ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో అతని కుటుంబసభ్యులు చేర్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు అతనికి డెంగ్యూ సోకిందని నిర్ధారించారు. రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతూ పోవడంతో, అతను బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు అతడిని ఈరోజు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన కాసేపటికే నరసింహారావు మృతి చెందాడు. దీంతో, గ్రామంలో విషాదం నెలకొంది.