: భూసమీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: మంత్రి నారాయణ
సీఆర్ డీఏ ద్వారా భూసమీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఐపీఎస్ అధికారి దైవ సహాయం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంపై ఏపీ మంత్రి నారాయణ స్పందించారు. భూసేకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఆ వ్యాజ్యం కొట్టివేత శుభసూచకమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏపీ రాజధానికి ఇంకా 1100 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉందన్నారు. న్యాయస్థానం ద్వారా రాజధానిని అడ్డుకోవడం మానుకోవాలని మంత్రి సూచించారు.