: శ్రీలంకకు కొరుకుడు పడని 'తోక'... భారత్ లీడ్ 385


కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టు రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక బౌలర్లకు భారత టెయిలెండర్లు కొరుకుడు పడక పోడవంతో భారత్ భారీ స్కోరునే చేసింది. 64 పరుగులకే నాలుగు వికెట్లు తీసి టాప్ ఆర్డర్ ను కూల్చిన ఆనందాన్ని ఆ జట్టుకు మిగల్చకుండా మిడిలార్డర్ తో పాటు బౌలర్లు సైతం ఆడుకుంటున్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 312 పరుగులు చేయగా, ప్రతిగా లంకేయులు 201 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్లు పుజారా, రాహుల్, రహానేలు వరుసగా 0, 2, 4 పరుగులకు ఔటై, ఆపై వచ్చిన కోహ్లీ నిరాశ పరుస్తూ, 21 పరుగులకే పెవీలియన్ దారి పట్టగా, శర్మ 50, బిన్నీ 49, ఓజా 35, మిశ్రా 39, యాదవ్ 4 పరుగులకు ఔటయ్యారు. ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ క్రీజులో నిలదొక్కుకుని లంక బౌలర్ల సహనానికి పరీక్ష చాలా సేపు పరీక్షగా నిలిచాడు. చివరికి 58 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దమ్మిక ప్రసాద్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దీంతో 76 ఓవర్లలో భారత్ 274 పరుగులు చేసినట్లయింది. ఆట ఇంకా మరో రోజు మిగిలి ఉండగా, శ్రీలంక ఎదుట 386 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించింది. ఏదైనా అధ్భుతం జరిగితే లంక కనీసం డ్రాతో మ్యాచ్ ని ముగించే అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఓటమి తప్పక పోవచ్చని క్రీడాపండితులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News