: పోస్ట్ పెయిడ్ ఛార్జీలు పెంచిన ఎయిర్ టెల్, ఐడియా
ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, ఐడియా తమ పోస్ట్ పెయిడ్ ఛార్జీలు పెంచాయి. కొన్ని నెలల కిందటే ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థలు 2జీ, 3జీ సేవల ప్రీపెయిడ్ ఛార్జీలను 47 శాతం పెంచాయి. మళ్లీ ఇప్పుడు వొడాఫోన్ తప్ప మిగతా రెండు సంస్థలు పోస్ట్ పెయిడ్ ఛార్జీలను 20 శాతం పెంచాయి. ఈ విషయాన్ని టెలికాం సంస్థలు తమ వెబ్ సైట్లలో తెలిపాయి. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తూర్పు, ఉత్తరప్రదేశ్ పశ్చిమ సర్కిళ్లలో ఎయిర్ టెల్ ఛార్జీలను పెంచింది. ఐడియా... ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ సర్కిళ్లలో ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెంచిన ఛార్జీలతో రెండు సంస్థల పోస్ట్ పెయిడ్ వినియోగదారులు ఇకపై 1జీబీ నుంచి 3జీబీ వరకు డేటా వాడుకోవడానికి రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ రేటు రూ.250 ఉండేది. వొడాఫోన్ మాత్రం పాత చార్జీల మేరకు డేటా సేవలను అందించనుంది.