: ఇద్దరు 'సూదిగాళ్ల' అరెస్ట్!
ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలకు ఇంజక్షన్లు వేస్తున్న సైకోలుగా అనుమానిస్తూ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో ఓ వ్యక్తిని, తూర్పు గోదావరి జిల్లా బొబ్బర్లంకలో మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోదాల్లో భాగంగా వీరి నుంచి బైక్, సూదులను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. రావులపాలెం పోలీసు స్టేషనుకు తరలించి వీరిని విచారిస్తున్నట్టు సమాచారం. వీరిలో ఒకరు కడియం మండలం బుర్రెలంక గ్రామానికి చెందినవాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వీరే సైకోలని అప్పుడే నిర్థారణకు రాలేమని, వీరి వద్ద సూదులు ఎందుకు ఉన్నాయన్న విషయమై విచారణ జరుపుతున్నామని పోలీసులు వివరించారు.