: బంగారం నిండిన ఆ రైలు మాదేనంటున్న రష్యా... అంత సీను లేదంటున్న పోలెండ్!


రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మాయమై, పోలెండులో కనుగొనబడినట్టు చెబుతున్న 'నాజీ గోల్డ్ ట్రైన్' తమకే చెందాలని రష్యా కోరనున్నట్టు తెలుస్తోంది. యూఎస్ఎస్ఆర్ సామ్రాజ్యంలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి జర్మన్ దళాలు ఈ రైలును దొంగిలించుకుని పోయాయి. దశాబ్దాల తరబడి వెలుగులోకి రాకుండా ఉండిపోయిన ఈ రైలును పోలెండ్ లోని పర్వత సొరంగాల్లో తాము గుర్తించినట్టు నిధుల అన్వేషకులు తెలిపారు. ఈ రైలు తమదే కాబట్టి తమకు చెందాలన్న వాదన వినిపించేందుకు రష్యా అంతర్జాతీయ న్యాయస్థాన నిపుణుల సలహాలు కోరుతుండగా, తమ దేశంలో ఈ రైలు దొరికినట్లయితే, అది తమ సంపదే అవుతుందని పోలెండ్ మంత్రి పియార్ట్ జుచూవ్ స్కీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని, తమ న్యాయవాదులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారని తెలిపారు. రైలును రష్యాకు ఇచ్చే అవకాశాలే లేవని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News