: టీడీపీలో చేరుతున్న ఆమంచి కృష్ణమోహన్
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో సెప్టెంబర్ 2న తాను పార్టీలో చేరుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి చంద్రబాబుకే ఉందని పేర్కొన్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధి చూసే టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కృష్ణమోహన్ గెలుపొందారు. అంతకుముందు ఆయన బీజేపీలో చేరుతున్నారని కూడా వార్తలు వచ్చాయి.