: సోదరికి జరిగిన అన్యాయంతోనే ఉద్యమ బాట... యువ సంచలనం హార్దిక్ పటేల్
యువ సంచలనం హార్దిక్ పటేల్ ఉద్యమంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. గుజరాత్ లోని పటేళ్లను ఓబీసీ కోటాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో ఆయన చేపట్టిన ఉద్యమం అటు రాష్ట్ర ప్రభుత్వానికే కాక, ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ముచ్చెమటలు పట్టిస్తోంది. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ హార్దిక్ పటేల్ సాగిస్తున్న ఉద్యమంపై స్పందించారు. అసలు హార్దిక్ పటేల్ సాగిస్తున్న ఉద్యమానికి నాంది ఏమిటనే విషయంపై పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో మరో కారణం చేరిపోయింది. స్కాలర్ షిప్ విషయంలో తన సోదరికి జరిగిన అన్యాయం తనను ఆందోళన బాట పట్టించిందని హార్దిక్ నిన్న ప్రకటించారు. తన పోరు బాటకు చాలా కారణాలున్నా, తన సోదరికి జరిగిన అన్యాయం కూడా ఒకటని ఆయన వ్యాఖ్యానించారు.