: అమరావతిపై పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని రాజ్యాంగ విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ఐపీఎస్ అధికారి దేవ సహాయం ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్ పై విచారణను చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టింది. ఈ సందర్భంగా, ఈ అంశంపై వాదనలను హైకోర్టులో వినిపించాలని పిటిషన్ దారుకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేనంటూ... పిటిషన్ ను కొట్టివేసింది.