: డిగ్గీరాజా టూర్ క్యాన్సిల్... కాంగ్రెస్ లోకి జగ్గారెడ్డి రీఎంట్రీ మరింత ఆలస్యం


కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ హైదరాబాదు పర్యటన రద్దైంది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం నేటి ఉదయం డిగ్గీరాజా హైదరాబాదుకు రావాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. మొన్నటి ఎన్నికల దాకా కాంగ్రెస్ లోనే ఉన్న జగ్గారెడ్డి రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీలో చేరిపోయారు. ఆ తర్వాత తాను బీజేపీలో చేరి తప్పు చేశానంటూ వ్యాఖ్యానించి తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడ్డారు. జగ్గారెడ్డిని తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ సమ్మతించడంతో ఆయన రీ ఎంట్రీకి నేడు ముహూర్తం ఖరారైంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల డిగ్గీరాజా ఉన్నట్టుండి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో సొంత గూటికి చేరేందుకు జగ్గారెడ్డి మరికొంత కాలం పాటు ఆగక తప్పని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News