: జగన్ లో ఒక్కోసారి 'అపరిచితుడు' బయటకు వస్తాడు: టీడీపీ నేత గొల్లపల్లి


ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల తొలిరోజే శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. గోదావరి పుష్కర మృతులపై సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగంపై జగన్ చేసిన వ్యాఖ్యలను పలువురు టీడీపీ సభ్యులు తిప్పికొట్టారు. పుష్కరాల్లో తొక్కిసలాట దురదృష్టకరమేనని టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మరణించిన వారి పునాదులపై ఏర్పడిందే వైసీపీ అని విమర్శించారు. జగన్ లో ఒక్కోసారి అపరిచితుడు బయటకు వస్తాడన్నారు. సభలో జగన్ హావభావాలు, మాటలు చూస్తుంటే అపరిచితుడు గుర్తుకొస్తాడని వ్యాఖ్యానించారు. ఆయనలా మాట్లాడటం తనకు బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News