: జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన స్పీకర్ కోడెల


గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాప తీర్మాన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తప్పుబట్టారు. సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే స్పీకర్ మైకులు కట్ చేస్తున్నారని జగన్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష నేత హుందాగా వ్యవహరించాలని సూచించారు. సభను అవమానపరిచేలా మాట్లాడటం తగదని జగన్ కు హితవు పలికారు. అయినప్పటికీ ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం చేస్తూనే ఉన్నారు.

  • Loading...

More Telugu News