: ఒకే వేదికపై టీడీపీ, టీఆర్ఎస్ కీలక నేతలు


అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. 'రెడ్డి సంఘం' సమావేశం దీనికి వేదికైంది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, రెడ్డి విద్యార్థుల కోసం సివిల్స్ కోచింగ్ ఇవ్వడానికి ఎవరైనా కోచింగ్ సెంటర్ పెడితే, తాను రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని చెప్పారు. పేద రెడ్డి విద్యార్థులను రెడ్డి సంఘాలు ఆదుకోవాలని కోరారు. నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, రెడ్లను అగ్రవర్ణంగా చిత్రీకరించారని, రెడ్లలో కూడా పేదలు చాలా మంది ఉన్నారని చెప్పారు. రెడ్డి సామాజికవర్గం అందరి మేలు కోరుతుందని అన్నారు. గతంలో రెడ్డి రాజుల పాలనలో గొలుసు చెరువులు ఉండేవని, ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులను మళ్లీ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా సివిల్స్ లో ర్యాంకులు సాధించిన రెడ్డి అభ్యర్థులను సన్మానించారు.

  • Loading...

More Telugu News