: ‘హోదా’పై చర్చకు టీడీపీ ప్రతిపాదన... స్పీకర్ కు నోటీసు ఇవ్వనున్న అధికార పక్షం
వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజైన నేడు ఏపీ అసెంబ్లీలో ఓ విశేషం చోటుచేసుకోనుంది. ఆయా అంశాలపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు స్పీకర్ కు నోటీసులు ఇవ్వడం మనకందరికీ తెలిసిందే. గడచిన సమావేశాల్లోనే కాక దాదాపుగా అన్ని సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే అందుకు భిన్నంగా ఏపీలోని అధికార పక్షం టీడీపీ నేడు స్పీకర్ కోడెల శివప్రసాద్ కు వాయిదా తీర్మానాన్ని అందించనుంది. ఏపికి ప్రత్యేక హోదాపై చర్చకు అనుమతించాలని ఆ పార్టీ స్పీకర్ ను కోరనుంది. ప్రతిపక్షాన్ని ఇరుకునపెట్టే వ్యూహంలో భాగంగానే టీడీపీ ఈ వినూత్న చర్యకు శ్రీకారం చుడుతోంది. మరి దీనిపై విపక్షం వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.