: అధిక జనాభాకు కారణమవుతున్న ఆ వర్గంపై చైనా తరహా చట్టాలు ప్రయోగించాలి: బాబా రామ్ దేవ్
విఖ్యాత యోగా గురు బాబా రామ్ దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి ఓ మతస్తుల కారణంగానే జనాభా అధికమవుతుండడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. ఛండీగఢ్ లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో జనాభా పెరుగుదలను నియంత్రించాల్సి ఉందని అన్నారు. అందుకు చైనా తరహా కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. జనాభా పెరుగుదలను కట్టడి చేసేందుకు నిర్దిష్ట జనాభా విధానం అవసరమని పేర్కొన్నారు. ఇటీవలే కేంద్రం మతాల వారీగా జనాభా లెక్కలను విడుదల చేయడం తెలిసిందే. ముస్లింల జనాభాలో ఏటా 0.8 శాతం పెరుగుదల కనిపిస్తుండగా, అదే సమయంలో హిందువులు, సిక్కుల జనాభాలో పెరుగుదల తక్కువగా ఉందని గుర్తించారు.