: ఆలయ గోపురం ఎక్కిన అర్చకులు.. అరెస్ట్ చేసిన పోలీసులు


తెలంగాణలో అర్చకుల సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. 010 పద్దు కింద వేతనాల చెల్లింపు సహా పలు డిమాండ్లతో ఇటీవలే రాష్ట్రంలోని ఆలయాల ఉద్యోగులు, అర్చకులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెజారిటీ ఆలయాల్లో పూజాదికాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ అధికారులు అర్చకులతో చర్చలు ప్రారంభించారు. ఈ క్రమంలో హైదరాబాదులోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ ఉద్యోగులు, అర్చకులతో జరిపిన చర్చల్లో భాగంగా విదుల్లో చేరాలంటూ అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో భగ్గుమన్న అర్చకులు ఆలయ గోపురం ఎక్కారు. వేధింపులు ఆపకపోతే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని గోపురం ఎక్కిన అర్చకులను కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News